బొమ్మ బ్లాక్ బస్టర్ వదిలిన మెగా ప్రిన్స్..!

-

యువ హీరో నందు విజయ్ కృష్ణ హీరోగా నిలదొక్కుకోవడానికి ఎన్నో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్నారు నందు విజయ కృష్ణ. ఇటీవలే నందు విజయ్ కృష్ణ హీరోగా… జబర్దస్త్ బ్యూటీ రష్మి గౌతమ్ హీరోయిన్ గా నటించిన చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్.. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై రాజ్ విరాట్ డైరెక్షన్లో తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ కూడా విడుదలయింది.

ఇప్పుడు తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఆల్బమ్ నుంచి రాయే నువ్వు రాయే అనే ఒక పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ పాట మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ట్విట్టర్ ద్వారా ఈ పాటను విడుదల చేసింది. ఇక ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న నందు విజయ్ కృష్ణ దర్శకుడు పూరి జగన్నాథ్ వీరాభిమానిగా నటిస్తున్నాడు అన్న విషయం ఇటీవల విడుదలైన టీజర్ ఫస్ట్ లుక్ లో చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. మరి ఈ సినిమానైనా నందు కి మంచి హిట్ ఇస్తుందా లేద చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version