ఏపీలో భారీ వర్షాల వలన వరదలు కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్ని పరిశీలించారు. సీఎం వెంట మంత్రులు సుచరిత, కొడాలి నానిలు కూడా ఏరియల్ సర్వేకు వెళ్లారు.
వరదల వలన వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింది. ఈ పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ఏరియల్ సర్వే చేపట్టారు. ఇప్పటికే భారీ వర్షాలు, వరదలపై అధికారులు, మంత్రులతో సమీక్ష జరిపిన జగన్ వరద కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రానికి సాయం చేయాల్సిందిగా కేంద్రానికి లేఖ సైతం రాశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 4450 కోట్ల నష్టం జరిగిందని, తక్షణ అవసరాల కోసం వెంటనే రూ.2250 కోట్లు సాయం అందించమని జగన్ కోరారు,