మెగా అండదండలతో తేజూ..!

-

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చిన మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కెరియర్ మొదట్లో జోష్ ఫుల్ హిట్లు అందుకున్నా తర్వాత మాత్రం ఢీలా పడ్డాడు. సుప్రీం హిట్ కొట్టిన తేజూ సుప్రీం హీరోగా స్క్రీన్ నేమ్ వేసుకోగా ఆ తర్వాత వచ్చిన తిక్క నుండి లేటెస్ట్ గా వచ్చిన తేజ్ ఐలవ్యూ వరకు ఫలితాలు ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్, కిశోర్ తిరుమల కాంబినేషన్ లో వస్తున్న చిత్రలహరి సినిమాలో సాయి ధరం తేజ్ నటిస్తాడని తెలుస్తుంది.

ఈ సినిమా కోసం తేజూ పూర్తిస్థాయిలో మేకోవర్ జరుగుతుందట. ఇదిలాఉంటే మేనళ్లుడు వరుస ఫ్లాపుల మీద దృష్టి పెట్టిన చిరంజీవి అతనికి అండగా ఉండాలని ఫిక్స్ అయ్యాడట. ఇన్నాళ్లు తేజూ చేస్తున్న సినిమాల అవుట్ పుట్ గురించి అడిగి తెలుసుకునే చిరు ఇప్పుడు తేజూ కోసం కథలను రిఫర్ చేస్తున్నాడట. బెజవాడ కథా రచయిత ప్రసన్న కుమార్ మెగా హీరో కోసం ఓ కథ రాసుకున్నాడట. చిరంజీవి ఆ కథను తేజూకి రిఫర్ చేశాడట.

త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది. అల్లు అరవింద్ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. చిరు చెప్పడంతో అరవింద్ తేజూ సినిమా నిర్మాణానికి సై అన్నాడట. మరి మెగా అండదండలతో వస్తున్న తేజూ ఇకనుండైనా సరైన ఫలితాలను అందుకుంటాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version