మెగాస్టార్ 157 టైటిల్ ఇదే

-

మెగాస్టార్ చిరంజీవి చేతిలో ప్రస్తుతం రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. అందులో విశ్వంభర ఒకటి అయితే.. మరో మూవీ టాలీవుడ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి తెరకెక్కించే మెగా 157 చిత్రం మరొకటి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, చిరు కూతురు సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి అయింది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

glimps

చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ కామెడీ జోనర్ లో ఈ చిత్రం ఉండనుంది. 2026 సంక్రాంతి బరిలో ఉండనుంది. ఇవాళ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా తాజాగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ముందు నుంచి రూమర్స్ ఉన్నట్టే “మన శంకర వరప్రసాద్ గారు” అనే టైటిల్ ను ప్రకటించేశారు. ఈ గ్లింప్స్ లో చిరంజీవి లుక్స్ అదిరిపోయాయి. గ్లింప్స్ చూస్తుంటే పక్కా కమర్షియల్ హిట్ సినిమా అని తెలుస్తోంది. ఈ గ్లింప్స్ కి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఇచ్చారు. ఈ చిత్రంలో వెంకటేష్ కీలక పాత్రలో నటించనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news