కేటీఆర్ క్యారెక్టర్ లేనోడు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

కాంగ్రెస్ పై మాట్లాడిన కేటీఆర్ క్యారెక్టర్ లేనోడు అని  జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ థర్డ్ క్లాస్ పార్టీ అయితే.. మీ నాన్న థర్డ్ కదా అని ప్రశ్నించారు. మీ నాన్న కేసీఆర్ థర్డ్ క్లాస్ పాఠాలే నేర్చుకున్నారు కదా తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియాగాంధీ ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు.

jaggareddy

బీఆర్ఎస్ నేతలు డ్రామా ఆర్టిస్టుల్లా వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ కి పొలిటికల్ మెచ్యూరిటీ లేదు అన్నారు. బాధ్యత గల నాయకుడిగా కేటీఆర్ మాట్లాడటం లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.7లక్షల కోట్లు అప్పు చేశారని తెలిపారు. రాజకీయంగా కేటీఆర్ కి ఏమాత్రం అవగాహన లేదు. జగ్గారెడ్డి కి బీఆర్ఎస్ పోటీ ఉండాలనే కోరుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే రసవత్తర పోటీ ఉండే విషయం అందరికీ తెలుసు అన్నారు జగ్గారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news