మెగాభిమానుల కోసం చిరంజీవి సూప‌ర్ డిసీష‌న్‌..?

-

‘సైరా నరసింహారెడ్డి’ సినిమా తరువాత, రామ్ చరణ్ నిర్మాతగా, కొరటాల శివ దర్శకత్వంలో 152వ చిత్రం చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అభిమాన గణమే వేరు. ఆయన సినిమా వస్తుందంటే.. ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. తన ఎదుగుదలకు కారణం తన అభిమానులే అని పలు సందర్భాల్లో చిరంజీవి బాహాటంగానే ప్రకటించారు. అభిమానుల అండతో బ్లడ్ బ్యాండ్, ఐ బ్యాంక్‌ను స్టార్ట్ చేసి సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారు.

అభిమానులకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డులను ఇచ్చిన చిరంజీవి.. బ్లడ్, ఐ బ్యాంక్ కోసం శ్రమించిన అభిమానులకు జీవిత భీమాను చేయించబోతున్నారట. ఒకవేళ అభిమానుల్లో ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునేలా ఈ జీవిత భీమా ఉంటుందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే.. ఇప్పటి వరకు అభిమానులకు ఆర్థికంగానూ, మరో రూపంలోనూ సాయం చేసిన హీరోలను చూసి ఉంటాం కానీ.. అభిమానులకు, వారి కుటుంబాలకు జీవిత భీమా భరోసాను కల్పించే తొలి హీరో మెగాస్టార్ చిరంజీవే అవుతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version