ఇటీవలే కల్కీ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ డివైడ్ టాక్ ను తెచచుకుంది. ఈ సందర్భంగా బూస్టింగ్ ఇంటర్వూలో ప్రశాంత్ చిరు విషయం రివీల్ చేసాడు.
మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే ఆషామాషీ కాదు. దర్శకుడిగా ఎంతో అనుభవం ఉండాలి. ముందు కథ వినిపించాలంటేనే బోలెడంత ఎక్స్ పీరియన్స్ ని పరిగణలోకి తీసుకుంటారు. అతని వివరాలు తెలుసుకుని అపాయింట్ మెంట్ కల్పిస్తారు. మెగాస్టార్ వద్దకు వెళ్లడమే ఓ పెదమద మిషన్. అలాంటింది ‘అ’ దర్శకుడు చిరంజీవికి కథ చెప్పి రికార్డు సృష్టించాడు. కథ ఒకే అయిందా? లేదా? అన్నది సెకెండరీ. కానీ ఓ లెజెండరీ ముందు కూర్చుని కథ చెప్పే అరుదైన అవకాశం అతనికి దక్కింది. అతేనా ఆ కథ విని చిరంజీవి అతన్ని ఆకాశానికి ఎత్తేసారుట. నాకు కథలు వినిపించిన వాళ్ల జాబితాలో నువ్వు టాప్ 5లో ఉన్నావంటూ చిరు కితాబిచ్చారుట.
అవును ఇదంతా నిజమే రూమర్ కాదు. సాక్షాత్తు ఈ విషయాన్ని అ దర్శకుడు ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. ఇటీవలే కల్కీ సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ డివైడ్ టాక్ ను తెచచుకుంది. ఈ సందర్భంగా బూస్టింగ్ ఇంటర్వూలో ప్రశాంత్ చిరు విషయం రివీల్ చేసాడు. ఒక నిర్మాత ద్వారా చిరు కు కథ చెప్పే అవకాశం వచ్చిందిట. కానీ చిరంజీవి గారికి కథ చెప్పగలనా? లేదా? అని చాలా టెన్షన్ పడ్డాడుట. టెన్షన్ లో చెప్పలేమోనని వెళ్లాలనుకోలేదుట. కానీ ఆ నిర్మాత ఇలాంటి అవకాశం మళ్లీ రాదని ఎంకరేజ్ చేసి ..సద్వినియోగం చేసుకోమని చెప్పి పంపిచాడుట. ఆ హీరో సినిమా టిక్కెట్ కోసం క్యూలో నిలబడ్డాను.
కానీ ఇప్పుడు ఆ హీరో నా ముందు ఉన్నారు. దీంతో చిరంజీవి గారు అన్నట్లు కాకుండా… ఒక స్నేహితుడికి కథ చెబుతున్నట్లు గా ఫీలై కథ చెప్పాను అని ప్రశాంత్ వెల్లడించాడు. కథ పూర్తయిన తర్వాత చిరు ఇప్పటివరకూ చాలా మంది కథలు చెప్పారు. అందులో టాప్ 5లో నువ్వు ఉన్నావ్ అన్నారుట. ఆ మాటలు నమ్మలేక మరోసారి అడిగాడుట. చాలా బాగా చెప్పావని అభినందించారుట. ఆ మాట తనకు ఎంతో ఉత్సాహన్ని ఇచ్చిందని…ఆ కామెంట్ ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు. ఇదంతా `అ `సినిమా తీయక ముందు జరిగిన స్టోరీ అట. అది మ్యాటర్.