టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి తొలి సినిమా పునాదిరాళ్ళులో ఆయన నటనకు అప్పట్లో మంచి మార్కులు పడ్డాయి. ఆ తరువాత ప్రాణం ఖరీదు సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకున్న చిరంజీవి, తన తొలి చిత్ర దర్శకుడు రాజ్ కుమార్ తో అనుబంధం గురించి కొన్నిమార్లు ప్రస్తావించడం జరిగింది. అయితే ఇటీవల కొద్దిరోజుల క్రితం రాజ్ కుమార్, ఆర్ధిక పరిస్థితి బాగోకపోవడం, అలానే ఆయన భార్య, కుమారుడు ఇద్దరూ కూడా అనారోగ్య కారణాల వలన మరణించడంతో కృంగిపోయారని తెలుసుకున్న చిరంజీవి, రాజ్ కుమార్ ను వ్యక్తిగతంగా పరామర్శించడం జరిగింది.
అయితే మెగాస్టార్ ని కలిసిన సమయంలో రాజ్ కుమార్ ఒంటరి గా ఒక అద్దె ఇంట్లో ఉండడం, అలానే అప్పటికే ఆయన ఆరోగ్యం కూడా కొంత క్షీణించడంతో వెంటనే గ్రహించిన మెగాస్టార్, ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్సను ఇప్పించడంతో పాటు ఆర్ధికంగా కూడా కొంత సాయం అందించారు. అయితే నేడు హఠాత్తుగా రాజ్ కుమార్ మృతి చెందడంతో మెగాస్టార్ ఎంతో కృంగిపోయినట్లు తెలుస్తోంది.
తనకు నటనలో ఎన్నో మెళకువలు నేర్పిన రాజ్ కుమార్ గారు నేడు మనల్ని వదిలి అనంతలోకాలకు వెళ్లిపోవడం నిజంగా తనను ఎంతో బాధించే విషయం అని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మెగాస్టార్ మీడియాకు ఒక ప్రకటన రిలీజ్ చేసారు. కృష్ణా జిల్లా ఉయ్యురు కు చెందిన రాజ్ కుమార్, సినిమాల పట్ల ఆసక్తితో అప్పట్లో టాలీవుడ్ కి చేరి ఎన్నో కష్టాలు పడ్డారు. ఇక నేడు ఆయన మృతికి పలువురు టాలీవుడ్ వర్గ ప్రముఖులు నివాళులు అందిస్తున్నారు….!!