అమ్మడి లక్ అలా ఉంది మరి..!

-

సినిమా పరిశ్రమలో లక్ అనేది ఎలా వర్క్ అవుట్ అవుతుందో ఎవరికి తెలియదు. ఒక్క సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకునే భామలున్న ఈ టైంలో మొదటి సినిమా ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అనే ముద్ర వేసే సందర్భాలు ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా ఓ ముద్దుగుమ్మ చేసిన రెండు సినిమాలు నిరాశపరచినా సరే ఆఫర్లు మాత్రం అదరగొడుతున్నాయి.

కోలీవుడ్ క్రేజీ హీరో ధనుష్, గౌతం మీనన్ కాంబినేషన్ లో వచ్చిన ఎన్నై నొక్కి పాయుం తొట్ట సినిమాలో హీరోయిన్ గా నటించింది మేఘా ఆకాష్. ఆ సినిమా రిలీజ్ అవలేదు కాని ఈలోగా తెలుగులో నితిన్ తో లై, ఛల్ మోహన్ రంగ సినిమాల్లో నటించింది మేఘా ఆకాష్. ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయినా తమిళంలో రజిని, కార్తి సుబ్బరాజు కాంబోలో వస్తున్న పెట్ట మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఇదే కాకుండా అత్తారింటికి దారేది తమిళ రీమేక్ లో మేఘా సెలెక్ట్ అయ్యింది. ఇది చాలదు అన్నట్టు మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయని తెలుస్తుంది.

ఒక్క సినిమా పోతేనే ఆమెను పక్కన పెడుతున్న ఈరోజుల్లో మేఘా ఏం మ్యాజిక్ చేస్తుందో ఏమో కాని ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. అమ్మడు హిట్ ట్రాక్ లో పడితే ఇకా ఆమెకు తిరుగు ఉండదని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version