వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ హీరో విజయ్ దేవరకొండకు నోటా రూపంలో పెద్ద షాకే తగిలింది. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. తెలుగులో విజయ్ ఫాలోయింగ్ దృష్ట్యా 23 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అయితే టోటల్ రన్ లో నోటా తెలుగులో కేవలం 9.83 కోట్లు వసూళు చేసింది.
దాదాపుగా 60 శాతం నష్టాలు తెచ్చిపెట్టింది నోటా. కె.ఇ జ్ఞానవెల్ రాజా నిర్మించిన ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వచ్చింది. ఏరియాల వారిగా నోటా వరల్డ్ వైడ్ టోటల్ కలక్షన్స్ వివరాలు చూస్తే..
నైజాం : 3.40 కోట్లు
సీడెడ్ : 1.02 కోట్లు
ఉత్తరాంద్ర : 0.85 కోట్లు
ఈస్ట్ : 0.56 కోట్లు
వెస్ట్ : 0.35 కోట్లు
కృష్ణా : 0.50 కోట్లు
గురంటూరు : 0.67 కోట్లు
నెల్లూరు : 0.33 కోట్లు
ఏపి/తెలంగాణా : 7.63 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.85 కోట్లు
ఓవర్సీస్ : 1.30 కోట్లు
వరల్డ్ వైడ్ : 9.83 కోట్లు