వెబ్ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న మిల్కీ బ్యూటీ..!

-

తెలుగు చిత్ర పరిశ్రమలో తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందంతో.. నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. శ్రీ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఈ భామ.. వరస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ టాప్ హీరోయిన్స్ లో ఒక్కరిగా ఎదిగారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌లలో ఒకరైన తమన్నా ఇటీవల కరోనాకు గురైన విషయం తెలిసిందే.

thamanna
thamanna

ఇక తమన్నా దాదాపుగా టాలీవుడ్ యంగ్ హీరోలందరి సరసన నటించింది. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఆగడు, ఎన్టీఆర్‌తో ఊసరవెల్లి, ప్రభాస్‌ తో బాహుబలి, రామ్‌చరణ్‌ తో రచ్చ, అల్లు అర్జున్‌ తో బద్రీనాథ్ సినిమాలో నటిచింది ఈ భామ. ఇక అంతేకాకుండా వెటరన్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవితో సైరా, వెంకటేశ్ ‌తో ఎఫ్ 2, నాగార్జున తో ఊపిరి సినిమాల్లో చేసి అందరి ఆదరాభిమానాలను సాధించుకుంది ఈ భామ.

అయితే ఇటీవల తమన్నా లెవెన్త్ హ‌వ‌ర్ వెబ్ సిరీస్‌ లో నటిస్తుండగా ఆమెకు కరోనా వైరస్ సోకింది. ఇక ప్రవీణ్ సత్తారు ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తుండగా అతిత్ హీరోగా నటిస్తున్నాడు. తమన్నా ఇటీవల కోలుకొని ఈ సిరీస్ షూటింగ్‌ ను పూర్తి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయని సమాచారం. అమెరికన్ సిరీస్ 24 ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందుతుంది. ఓ రోజు రాత్రి జరిగిన సంఘటన ఆధారంగా సిరీస్ నడుస్తోంది. ఈ సిరీస్ అమెరికాలో చాలా పెద్ద హిట్ సాధించింది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో తమన్నా కొన్ని న్యూడ్ సీన్‌లలో కూడా నటించిందని పుకార్లు షికారు చేస్తున్నాయి. తమన్నా ప్రస్తుతం నితిన్‌తో కలిసి ఓ సినిమాలో చేస్తుంది. అయితే లెవెన్త్ హ‌వ‌ర్ ట్రైలర్‌ను ఆహా ప్లాట్ ఫాం కేంద్రంగా విడుదల చేసేందుకు వెబ్ యూనిట్ సిద్దమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news