ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన వివో వై51 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

-

మొబైల్స్ త‌యారీదారు వివో.. వై51 పేరిట ఓ నూత‌న మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.58 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 665 ప్రాసెస‌ర్, 8జీబీ ర్యామ్‌ల‌ను అమ‌ర్చారు. 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడు మ‌రో 8 మెగాపిక్స‌ల్ అల్ట్రావైడ్ సెన్సార్‌, 2 మెగాపిక్స‌ల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్స‌ల్ మాక్రో సెన్సార్‌ల‌ను ఏర్పాటు చేశారు. ముందు వైపు 16 మెగాపిక్స‌ల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ప‌క్క భాగంలో ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ దీంట్లో ఉంది. దీనికి 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌ను అందిస్తున్నారు.

Vivo Y51 smart phone launched in india

వివో వై51 స్పెసిఫికేష‌న్లు…

* 6.58 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2408 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 665 ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్, 1టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 11, డ్యుయ‌ల్ సిమ్, 48, 8, 2, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు
* 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్
* డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి
* 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

వివో వై51 స్మార్ట్ ఫోన్ టైటానియం స‌ఫైర్‌, క్రిస్ట‌ల్ సింఫ‌నీ క‌లర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైంది. ఈ ఫోన్ ధ‌ర రూ.17,990గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news