డీఎంకే అధినేత స్టాలిన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కమలహాసన్‌ను రాజ్యసభ అభ్యర్థుడిగా ప్రకటించింది డీఎంకే. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం 4 రాజ్యసభ సీట్లలో ఒక సీటును కమలహాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీకి కేటాయించారు డీఎంకే అధినేత స్టాలిన్.

తమిళనాడు రాష్ట్రంలో హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ఇప్పటికే ప్రకటించారు విజయ్. అయితే ఇలాంటి నేపథ్యంలో డీఎంకే పార్టీకి చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కమలహాసన్ పార్టీని దగ్గరికి చేర్చుకున్నారు డీఎంకే. ఇందులో భాగంగానే రాజ్యసభ అభ్యర్థుడిగా కమలహాసన్ ను ప్రకటించినట్లు తెలుస్తోంది.