‘మీర్జాపూర్‌’.. సీజన్‌ 3 ట్రైలర్‌ వచ్చేసింది

-

ఇండియన్ వెబ్‌సిరీస్‌లలో ది బెస్ట్‌ పేరు గాంచిన తొలి పది సిరీస్‌లలో తప్పకుండా మీర్జాపూర్ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లుగా వచ్చి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా మూడో సీజన్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సిరీస్ ఓటీటీలోకి వచ్చేస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తాజాగా మేకర్స్ సూపర్ సర్‌ప్రైజ్ ఇచ్చారు.

‘మీర్జాపూర్‌’ మూడో సీజన్‌ జులై 5వ తేదీ నుంచి ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ లో స్ట్రీమింగ్‌ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీజన్ -3 ట్రైలర్‌ ఇవాళ (జూన్ 20వ తేదీ 2024) విడుదలైంది. పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌ , శ్వేతా త్రిపాఠి శర్మ, విజయ్‌ వర్మ, ఇషా తల్వార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మూడో సీజన్‌.. గత సీజన్లను మించేలా ఉండనుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. కొత్త సీజన్‌లో మరికొన్ని పాత్రలు పరిచయం కానున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ ట్రైలర్ మీరూ చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news