కల్కి మూవీ రిలీజ్.. ప్రభాస్ ఫ్యాన్స్తో ఎమ్మెల్యే రఘురామ సందడి

-

అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో సందడి చేస్తోంది. సలార్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్‌కు మైథాలజీతో ముడిపెడుతూ ప్రేక్షుకలకు సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన అతి పెద్ద భారీ ప్రయత్నం సక్సెస్ అయినట్లు ప్రీమియర్, బెన్ఫిట్ షోల రివ్యూ చూస్తుంటే తెలిసిపోతోంది. ఊహించని రేంజ్లో కల్కి టికెట్ బుకింగ్స్ రికార్డులు సృష్టించడంతో ఈ సినిమా సక్సెస్ ఏ రేంజ్లో ఉండబోతోంది అర్థమైపోయింది. తాజాగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడంతో సినిమా హాల్స్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా లేదు.

కేవలం సాధారణ పౌరులే కాదు ప్రముఖులు కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలోని భీమవరంలో కల్కి సినిమా రిలీజ్ను, సక్సెస్ను ప్రభాస్ అభిమానులతో కలిసి ఎమ్మెల్యే రఘురామకృషరాజు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్తో కలిసి ఆయన కల్కి అనే లెటర్స్తో ఉన్న కేకులను కట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news