మంచు మనోజ్ – మౌనికల పెళ్లిలో మోహన్ బాబు.. పెళ్లికి రావడానికి ఆమె కారణమా..?

గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్న మంచు మనోజ్ – మౌనిక రెడ్డి ఎట్టకేలకు రూమర్లకు తెరదించుతూ నిన్న రాత్రి ఫిలింనగర్ లో 8:30గంటల సమయంలో మంచు లక్ష్మి నివాసంలో వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. అయితే ఈ పెళ్లి మంచు మోహన్ బాబుకు ఇష్టం లేదని.. అందుకే మంచు మనోజ్ కుటుంబానికి దూరంగా ఉంటున్నారు అంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారానికి బ్రేకులు వేస్తూ మోహన్ బాబు దంపతులు మంచు మనోజ్ – మౌనిక రెడ్డి పెళ్లిలో సందడి చేశారు.

నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. అయితే మౌనికను ఆశీర్వదిస్తున్న సమయంలో మౌనిక ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అయిపోయింది. వాస్తవానికి మోహన్ బాబు , భూమా నాగిరెడ్డి ఫ్యామిలీలు మంచి స్నేహితులు. అలా కుటుంబ సభ్యులు స్నేహితులు కావడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అలా ఇప్పుడు ఎట్టకే లకు వీరిద్దరు వివాహం చేసుకున్నారు. మౌనిక రెడ్డి తండ్రీ భూమా నాగిరెడ్డి స్వర్గస్తులయ్యారు. దీంతో తన తండ్రిని మోహన్ బాబు లో చూసుకొని ఆమె కన్నీటి పర్యంతమైనట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరికీ కూడా ఇది రెండవ వివాహం కావడం గమనార్హం.

మొన్నటి వరకు ఈ పెళ్లికి మోహన్ బాబు రారు.. కేవలం మంచు మనోజ్ – మౌనికలు ఎక్కడైనా రిజిస్టర్ ఆఫీస్లో వివాహం చేసుకుంటారు అంటూ రకరకాలుగా వార్తలు వినిపించాయి. కానీ ఈ పెళ్లికి పెద్దగా నిలిచి మంచు లక్ష్మి తన నివాసంలోని వీరి పెళ్లిని చాలా ఘనంగా నిర్వహించింది. ఈ క్రమంలోనే ఆమె తన తల్లిదండ్రులను ఒప్పించి ఈ పెళ్లికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.. ఈ విషయం తెలిసి మంచు లక్ష్మీపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా మంచు లక్ష్మీ పెద్ద మనసుతో ఇద్దరినీ కలిపి మరొకసారి తన మంచి మనసును చాటుకుంది. ఏదేమైనా ఇన్ని రోజులు వచ్చిన వార్తలకు తెరపడుతూ నూతన జీవితాన్ని మొదలుపెట్టారు మంచు మనోజ్ – మౌనిక రెడ్డి.