బాలకృష్ణ బోయపాటి శ్రీను ల సినిమాకి టైటిల్ ” మోనార్క్” ..?

-

నట సింహం నందమూరి బాలకృష్ణ వరస ఫ్లాపుల్లో ఉండగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సింహా తీసి బాలకృష్ణ కి భారీ కమర్షియల్ హిట్ ని ఇచ్చాడు. ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. సింహా తో ఫాం లోకి వచ్చిన బాలయ్య వరసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత ‘లెజెండ్’ తోనూ మరోసారి బాలకృష్ణ కి భారీ హిట్ ని ఇచ్చాడు బోయపాటి.

 

ఇక ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. వాటిలో ఒక పాత్ర అఘోర పాత్ర అని ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఈ పాత్ర కోసం రెండు రకాల గెటప్పులు డిజైన్ చేసినట్టు తాజా సమాచారం. త్వరలోనే ఆ రెండు గెటప్పులతో బాలయ్యకు మేకప్‌ టెస్ట్‌ లు చేసి అందులో ఒక గెటప్పుని ఫైనల్ చేస్తారట. ఇక ఈ సినిమాకు ‘మోనార్క్‌’ అనే టైటిల్‌ ను అనుకుంటున్నట్టు లేటెస్ట్ న్యూస్. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌ ను అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ గురించి కొన్ని రోజులుగా తెర మీదకి కీర్తి సురేష్, అంజలి, కన్నడ హీరోయిన్ అని..ఇలా చాలా పేర్లు తెర మీదకి వచ్చాయి. కాని బోయపాటి ఇంకా ఎవరీని ఫైనల్ చేయలేదని హీరోయిన్స్ ని త్వరలో ప్రకటిస్తామని స్వయంగా వెల్లడించారు. ఆ న్యూస్ కూడా బాలయ్య బర్త్ డే రోజున రానుందట. ఇక “మోనార్క్” అన్న టైటిల్ చూస్తే ఇది పూరి బాలయ్య కాంబినేషన్ లో వచ్చే సినిమాకైతే బావుంటుందన్న టాక్ వినిపిస్తుంది. మొత్తానికి “మోనార్క్” అన్న టైటిల్ ప్రేక్షకులకి బాగానే కనెక్ట్ అయింది. మరి ఇదే టైటిల్ ఫైనల్ చేస్తారో లేదో తెలియాలంటే జూన్ 10 వరకు ఆగాలి.

Read more RELATED
Recommended to you

Latest news