ఓటీటీలో ‘మంత్‌ ఆఫ్‌ మధు’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

టాలీవుడ్​లో కలర్స్ స్వాతి కమ్ బ్యాక్ ఇచ్చిన మూవీ మంత్ ఆఫ్ మధు. నవీన్‌ చంద్ర కీలక పాత్రలో నటించిన ఈ సినిమా క్టోబరు 6న విడుదలైంది. ఫీల్ గుడ్ మూవీగా.. ఎమోషనల్ కంటెంట్​తో ప్రతి ఒక్కరిని అలరించింది. ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు ఈ సినిమాకు ఫిదా అయ్యారు. ఇక ఈ చిత్ర ప్రమోషన్స్ కూడా ఫీల్ గుడ్ మూవీలా సాఫీగా సాగిపోవడంతో ప్రేక్షకులకు మంచి వైబ్ ఏర్పడింది. శ్రీకాంత్‌ నాగోతి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఆహా వేదికగా నవంబర్ 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇదీ మంత్ ఆఫ్ మధు స్టోరీ : ప్రభుత్వ ఉద్యోగి అయిన మధుసూధన్ రావు (నవీన్ చంద్ర)కు అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం పోతుంది. మరోవైపు భార్య లేఖ (స్వాతి రెడ్డి) తనపై విడాకుల కేసు పెడుతుంది. అయితే ఎప్పటికైనా తన దగ్గరకు మళ్ళీ తిరిగి వస్తుందని ఆశతో ఎదురుచూస్తూ మద్యానికి బానిసైపోతాడు. వీళ్లకు ఫ్లాష్ బ్యాక్‌లో ఓ లవ్ స్టోరీ. మరోవైపు మధుమతి (శ్రియ నవిలే).. బంధువుల ఇంట్లో పెళ్లి కోసం అమెరికా నుంచి వైజాగ్ వస్తుంది. ఓ సందర్భంలో మధుసూదన్‌ పరిచయమవుతాడు. మాటల సందర్భంలో అతడి గతాన్ని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది? చివరకు మధుసూదన్- లేఖ కలిశారా? లేదా అనేది కథ.

Read more RELATED
Recommended to you

Latest news