కొత్త ప్రభాకర్ రెడ్డి మరో హెల్త్ బులిటెన్ విడుదల

-

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల చేసారు వైద్యులు. 4 గంటల పాటు సర్జరీ చేసి సుమారు 15 ఇంచుల చిన్నపేగును తొలిగించటం ఇదంతా మొన్నటి వరకు జరిగింది. కాగా ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది.. ఆయన ఎప్పుడు కోలుకుంటారన్న అంశాలపై యశోదా డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

మొన్న జరిగిన కత్తి దాడిలో ప్రభాకర్ రెడ్డి కడుపులోకి 3 ఇంచుల లోతుకు కత్తి దిగగా లోపల చిన్నపేగుకు నాలుగు చోట్ల గాయాలైనట్టు వైద్యులు వెల్లడించారు. సుమారు 4 గంటల పాటు సర్జరీ చేయగా సుమారు 15 సెంటీమీటర్ల మేర చిన్నపేగును తొలగించినట్లు వైద్యులు తెలిపారు.

సర్జరీ తర్వాత ప్రభాకర్ రెడ్డిని పోస్ట్ ఆపరేటివ్ కోసం ICU కి షిఫ్ట్ చేశామని, బీపీ సాధారణంగా మెయింటైన్ అవుతుందన్నారు. ఇప్పుడే ఆరోగ్యం కుదుటపడింది అని చెప్పడానికి లేదన్నారు. ICU లోనే ఇంకో 5 రోజులు చికిత్స అందించాలన్నారు. పదిహేను రోజులు తరువాత కుట్లు తీస్తామని, ఇది మేజర్ సర్జరీగానే చెప్పొచ్చని, రికవరీకి సమయం పడుతుందని వైద్యులు పేర్కొన్నారు. బయట చిన్న గాటులాగే ఉంటుందని, కానీ లోపల పేగుల దగ్గర కత్తి పోటు కావటంతో సమయం పడుతుందని వైద్యులు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news