దేశం లోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీ నిర్మాణానికి యోగీ ఆదిత్యనాథ్ తీర్మానం..

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ సెలెబ్రిటీలపై జరుగుతున్న కేసులు, ఆరోపణలు అందరికీ తెలిసిందే. బాలీవుడ్ సెలెబ్రిటీలు ఒకరినొకరు విమర్శించుకుంటూ ప్రజల్లో ఒకరకమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేసారు. అసలే కరోనా కారణంగా థియేటర్లు మూతబడి సినిమాలు లేవు. దానికి తోడు సెలెబ్రిటీలపై కేసులు బాలీవుడ్ పై మచ్చలా తయారయ్యాయి. అయితే తాజాగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, దేశంలోనే అతిపెద్ద ఫిలిమ్ సిటీని నిర్మిస్తా అంటున్నాడు.

ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధ నగర్, నోయిడా ప్రాంతంలో ఈ నిర్మాణం చేపట్టనున్నారని సమాచారం. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసాడు. దేశంలోనే అతిపెద్ద ఫిలిమ్ సిటీ ఇక్కడే నిర్మితమవుతుందని చెబుతూ, దానికి కావాల్సిన పనులు తొందర్లోనే ప్రారంభం కాబోతున్నాయని అన్నాడు. ఫిలిమ్ సిటీకి కావాలిన భూమి కోసం వెతకమని అధికారులకి సమాచారం అందజేసారు.