అత్యధిక బాషలలో రీమేక్ అయ్యి రికార్డ్ కొట్టిన తెలుగు సినిమా…!!!

-

సహజంగా ఒక బాషలో రిలీజ్ అయిన హిట్ సినిమాని మరొక బాషలో రీమేక్ చేస్తారు. అదే సినిమా మాతృక బాషలో పెద్దగా ఆడక పోవచ్చు కానీ రీమేక్ అయిన బాషలో సూపర్ సక్సెస్ అవ్వచ్చు అలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలు చాలా మటుకు వేరే బాషలలో రీమేక్ అయ్యాయి. అలాంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ భారత దేశ సినిమా చరిత్రలో అత్యధిక బాషలలో రీమేక్ అయిన సినిమా ఏంటో తెలుసా… “నువ్వు వస్తానంటే నేను వద్దంటానా”.

ఈ సినిమా అప్పట్లో తెలుగు చిత్ర సీమని ఒక ఊపు ఊపేసింది. ప్రేమలో మునిగితేలిపోతున్న కుర్ర కారుని ఒక్క సారి ఆలోచింప చేసింది. ప్రేమకి ఉన్న విలువ అందులోని గొప్ప వాస్తవాన్ని చాటి చెప్పింది. చివరికి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ సినిమా హక్కుల్ని వివిధ బాషల వాళ్ళు కొనుగోలు చేశారు. దాదాపు తెలుగుతో కలిసి ఈ సినిమా 7 భారతీయ బాషలలో రిలీజ్ అయ్యింది.

ఏం ఎస్ రాజు నిర్మాతగా, ప్రభుదేవా దర్శకుడిగా తీసినిన ఈ సినిమా ప్రభుదేవా దర్శకత్వ కేరియన్ ని ఓ మలుపు తిప్పిందనే చెప్పాలి. తమిళంలో ఈ సినిమా “ఉనక్కం ఎనక్కం” గా రిలీజ్ అయ్యి అక్కడ కూడా భారీ హిట్ కొట్టింది. కన్నడంలో నీనెల్లో –నా నెల్లె గా రిలీజ్ అయ్యి కన్నడ ప్రేక్షకుల మనసు చొరగొంది. ఒరియాలో “సున చాదేయ్ మె రూప చాదేయ్” గా రిలీజ్ చేశారు. బెంగాలీలో “ఐ లవ్ యూ” హిందీలో రామయ్య వస్తావయ్య” పజాబీలో తేరా మేరా కి రిస్తా” అనే టైటిల్ తో రీమేక్ అయ్యింది.

వీటితో పాటు బంగ్లాదేస్ బెంగాలిలో “నిస్సా అమర్ తుమీ” నేపాలీలో “ఫ్లాష్ బ్యాక్ ఫర్కెరా హెర్దా” గా రిలీజ్ అయ్యి అన్ని చోట్లా బంపర్ హిట్ అందుకున్న ఏకైక చిత్రంగా మన తెలుగు సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులో ఈ సినిమాకి ఏకంగా నాలుగు నంది అవార్దులు, తొమ్మిది ఫిలిం ఫేర్ , రెండు సంతోషం అవార్డులు దక్కాయి. అయితే ఇప్పటి వరకూ ఎక్కువ ఫిలిం ఫేర్ అవార్డులు పొందిన ఏకైక తెలుగు చిత్రంగా కూడా ఈ సినిమా రికార్డ్ క్రియేట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news