ప్ర‌భాస్ కోసం హాలీవుడ్ రేంజ్‌లో సినిమా.. నాగ్ అశ్విన్ డేరింగ్ స్టెప్‌

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు నేష‌న‌ల్ స్టార్ అయిపోయాడు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఈయ‌న‌కు అభిమానులు ఉన్నారు. అందుకే ఏ సినిమా చేసినా ప్యాన్ ఇండియా సినిమాలుగా చేస్తున్నాడు. అన్ని భాష‌ల్లో సినిమాల‌ను తెర‌కెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే రాధే శ్యామ్‌, స‌లార్‌, ఆదిపురుష్ వంటి ప్యాన్ ఇండియా సినిమాల్లో బిజీగా ఉన్నాడు.

 

ఇక దీని త‌ర్వాత నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేస్తున్నాడు ప్ర‌భాస్‌. దీన‌ని హై బడ్జెట్ స్కై ఫై ఫాంటసీ థ్రిల్లర్ చిత్రంగా తీస్తున్నారు. ఎన్నో అంచనాలున్న ఈ సినిమాప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో మొదలు పెట్టుకొని షూటింగ్ చేయ‌డానికి రెడీగా ఉంది.

ఇక ఈ సినిమాను ప్ర‌స్తుత కాలం, పాత త‌రం కాలానికి సంబంధించి కాకుండా.. పూర్తిగా భవిష్యత్తులో జ‌ర‌గ‌బోయే సంఘ‌ట‌నల ఆధారంగా పీరియాడిక్ డ్రామాలా ఉంటుందట. హాలీవుడ్ సినిమాల తరహాలో ఇందులో కూడా స‌న్నివేశాలు ఉంటాయ‌ని తెలుస్తోంది. ఇందుకోసం నాగ్ అశ్విన్ సినిమాకు భారీ బ‌డ్జెట్‌ను ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.