కరోనా రెండో సారి వస్తే… మరణాలు ఈ రేంజ్ లో ఉన్నాయా…?

కరోనా రెండో వేవ్ లో మరణాలు పెరగడం ఒకటి అనుకుంటే ఇప్పుడు ఐ సి ఎం ఆర్ ఒక సంచలన విషయం వెల్లడించింది.కరోనా రెండో సారి వచ్చిన వారిలో వందలో 56 మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని ఒక సర్వే వెల్లడించింది. రెండో సారి కరోనా వచ్చి ఆస్పత్రుల్లో చికిత్స పొందే వారు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు అని గుర్తించారు. విచక్షణా రహితంగా యాంటీ బాడీస్ వాడటమే దీనికి ప్రధాన కారణం అని తెలిపారు.

అదే విధంగా స్టెరాయిడ్స్ వాడకం కూడా ఇప్పుడు ప్రధాన సమస్య అయింది అని చెప్పారు. యాంటీ బయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు వాడకుండా ఉండటమే మంచిది అని చెప్పారు. అలాగే వైద్యులు మందులను సూచించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా ఐసి ఎంఆర్ హెచ్చరించింది. గతంలో చికిత్స తీసుకుని ఇప్పుడు మళ్ళీ చికిత్స తీసుకోవడం ప్రధాన సమస్యగా మారినట్టు అభిప్రాయపడింది.