ఈ వారం ఓటీటీ, థీయేట‌ర్ లో విడుద‌ల అవుతున్న సినిమాలు

-

తెలుగు రాష్ట్రాల‌లో సినీ ప్రేమికులు చాలా మంది ఉంటారు. వారి కోసమే ఈ వార్త ఈ వారంలో ఓటీటీ ల‌లో థీయేట‌ర్ ల‌లో విడుద‌ల అయే సినిమాల గురించి తెలుసుకుందాం. ముందుగా ఓటీటీ లో విడుద‌ల అవుతున్న సినిమాలు, వెబ్ సిరిస్ లు ఇలా ఉన్నాయి.

మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల నిర్మించిన వెబ్ సిరీస్ ఒక చిన్న ఫ్యామిలీ. ఈ సిరీస్ ఈ నెల 19 న జీ5 లో ప్రసారం కాబోతుంది. ఈ సిరీస్ లో సంగీత్ శోభ‌న్, సిమ్రాన్ శ‌ర్మ‌, తుల‌సి, న‌రేష్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. అలాగే యంగ్ హీరో తేజ స‌జ్జా , హీరో రాజ‌శేఖర్ కూత‌రు శివానీ హీరోయిన్ గా వ‌స్తున్న సినిమా అద్భుతం. ఈ సినిమా ఇటీవ‌ల నే షూటింగ్ ను పూర్తి చేసుకుని డైరెక్ట్ గా ఓటీటీ ల‌లో నే విడుద‌ల అవుతుంది. ఈ సినిమా న‌వంబ‌ర్ 19 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో ప్రసారం కాబోతుంది. అలాగే అక్కినేని అఖిల్, పూజా హెగ్డే కాంబినేష‌న్ లో వ‌చ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా థీయేట‌ర్ల‌లో పెద్ద హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా ఆహా తో పాటు నెట్ ఫ్లిక్స్ ల‌లో న‌వంబ‌ర్ 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ హీరో గా వ‌స్తున్న సినిమా ధ‌మాకా. అ సినిమా కూడా డైరెక్ట్ నెట్ ఫ్లిక్స్ లో న‌వంబ‌ర్ 19 నాడే విడుద‌ల అవుతుంది.

అలాగే థీయేట‌ర్ల‌లో న‌వంబ‌ర్ 19 న రావ‌ణ లంక సినిమా విడుద‌ల అవుతుంది. ఊరికి ఉత్త‌రాన అనే సినిమా కూడా న‌వంబ‌ర్ 19 నే విడుద‌ల అవుతుంది. రామ్ అసుర్ అనే సినిమా కూడా ఈ నెల 19 న విడుద‌ల అవుతుంది. స్ట్రీట్ లైట్ తో పాటు పోస్ట‌ర్, సావిత్రి వైఫ్ ఆఫ్ స‌త్య‌మూర్తి అనే సినిమాలు కూడా ఈ నెల 19 థీయేట‌ర్ ల‌లో విడుద‌ల కాబోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news