మెట్రోలో ‘మిస్టర్ బచ్చన్’ ప్రమోషన్స్

-

మాస్ మహారాజ రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ షురూ చేసింది. అయితే ప్రమోషన్స్లో రవితేజ తన రూటే సపరేటు అని నిరూపించుకున్నాడు. తన మూవీని కాస్త డిఫరెంట్గా ప్రమోట్ చేయాలనుకున్నాడు. ప్రజల్లోకి తన మూవీ త్వరగా వెళ్లాలన్న ఉద్దేశంతో ఏకంగా మెట్రోను తన ప్రమోషన్కు వాడుకున్నాడు.

మిస్టర్ బచ్చన్ మూవీటీమ్ హైదరాబాద్ మెట్రో రైల్లో తమ సినిమాను ప్రమోట్ చేసుకుంది. ‘మెట్రో ప్రయాణికులకు స్వాగతం సుస్వాగతం. ఏం తముళ్లు మెట్రోలో ప్లేస్ దొరకలేదా? లేదా కూర్చోగానే లేపేస్తున్నారా? ఏం పర్వాలేదు. మిస్టర్ బచ్చన్ నుంచి లేటెస్ట్గా ఓ పాట రిలీజైంది. హ్యాపీగా వినుకుంటూ మీరు దిగాల్సిన స్టేషన్ వచ్చేదాకా నిల్చొని వెళ్లిపోండి. ఇక్కడ సీట్ దొరక్కపోయినా పర్వాలేదు. ఆగస్టు 15న థియేటర్కు వచ్చేయండి. అక్కడ సీట్ గ్యారెంటీ’ అని హీరో రవితేజ వాయిస్ మెసేజ్తో ప్రయాణికులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version