ముహూర్తం బాగాలేదు.. విశ్వ‌క్ సేన్ సినిమా వాయిదా

-

ఫ‌లక్‌నామ దాస్ సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి విశ్వ‌క్ సేన్ ప‌రిచ‌యం అయిన విషయం తెలిసిందే. కాగ ప్ర‌స్తుతం విశ్వ‌క్ సేన్.. అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఈ నెల 4న విడుద‌ల కావాల్సి ఉంది. కాగ కొన్ని కార‌ణ‌ల‌తో ఈ సినిమాను చిత్ర బృందం వాయిదా వేసింది. కాగ విషయాన్ని చిత్ర బృందం కాస్త ఫ‌న్నిగా అభిమానుల కోపానికి గురి కాకుండా అనౌన్స్ చేసింది. ”అల్లం అర్జున్ కుమార్ జాతక రీత్య మార్చ్ 4న పెళ్లి ముహూర్తం స‌రి కాద‌ని జ్యోతిష్యులు తీర్మానించారు. కావున కొత్త విడుద‌ల తేదీని త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తాం. ఇట్లు.. అల్లం వారి పెళ్లి బృందం”

అని ట్విట్టర్ లో చిత్ర బృందం పోస్టు చేసింది. కాగ ఈ సినిమాలో విశ్వ‌క్ సేన్ పెళ్లి కాని యువ‌కుడు అల్లం అర్జున్ కుమార్ పాత్ర‌లో క‌నిపిస్తాడు. కాగ దానికి సెట్ అయ్య‌లే.. సినిమా వాయిదాను ప్ర‌క‌టించింది. కాగ అశోక వ‌నంలో అర్జున క‌ళ్యాణం సినిమాకు సంబంధించిన పాట‌లు, ట్రైల‌ర్ ఇప్ప‌టికే విడుద‌ల అయింది. కామెడీ జోన‌ర్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమా.. ట్రైల‌ర్ తో అభిమానుల హృద‌యాల‌ను దోచుకుంది. కాగ ఈ సినిమా కోసం చాలా మంది హాస్య ప్రియులు ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news