సమంతను ఆనందంగా ఉంచడమే నా ప్రథమ లక్ష్యం – విజయ్ దేవరకొండ..!

-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ చివరిగా సక్సెస్ ఎప్పుడు చూసారో గుర్తులేదని చెప్పాలి ఇకపోతే ఇన్ని సంవత్సరాలుగా అభిమానులు మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆయన సెప్టెంబరు 1 న ఖుషి తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న విషయం తెలిసిందే . ఈ సినిమాతో తప్పకుండా సక్సెస్ సాధిస్తాననే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాదులో నోవాటెల్లో ఖుషి మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించగా.. అందులో విజయ్, సమంత క్రేజీగా ఎంట్రీ ఇచ్చి అందరిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తమ డాన్సులతో అదరగొట్టేశారు.

ఇక్కడైతే విజయ్ దేవరకొండ షర్టు విప్పి మరీ డాన్సులు వేయడం హైలెట్ గా నిలిచింది. దీంతో ప్రాంగణమంతా అభిమానులు హోరెత్తించారు. ఇక విజయ్ మాట్లాడుతూ.. గత ఏడాది ఏప్రిల్ నెలలో నవ్వుతూ ఈ సినిమాని మొదలుపెట్టాము అంతా సాఫీగా సాగిపోయింది ఇంకా 30% షూటింగ్ పెండింగ్లో ఉంది. సమంత మూడు రోజులు వస్తే ఆమె పార్ట్ మొత్తం అయిపోతుందని, వస్తుందని భావించాము. కానీ ఆమె ఆరోగ్యం బాగాలేదని చెప్పింది. రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందనుకున్నాము. కానీ సెట్ కాలేదని చెప్పింది. అలా రెండు మూడు వారాలు విశ్రాంతి తీసుకుంటే సెట్ అవుతుంది అనుకున్నాము. కానీ కావడం లేదు.. ఆ తర్వాతే ఒక ఈవెంట్లో సమంత తాను ఒక పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాను అని చెప్పింది అప్పుడు చాలా బాధ వేసింది.

ఈ విషయం చెప్పకూడదు అనుకున్నాము.. కానీ చెప్పాల్సి వచ్చింది.. చాలామంది ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు.. సమస్య ఉన్నప్పటికీ కూడా మనం పని చేయొచ్చని ,బాధపడాల్సిన పని లేదని చెప్పేందుకు ఈ విషయం చెప్పడం జరిగింది. ఇక సమంత అది చేసి నిరూపించింది. ఇప్పుడు మీకోసం కోలుకొని షూటింగ్ కంప్లీట్ చేసి, డాన్స్ కూడా చేసింది. ఇప్పటికీ ఆమె ఆరోగ్యం సరిగా లేదు.. లైట్లు పడితే తలనొప్పి వస్తుంది.. కళ్ళకు ఇబ్బంది ఉంటుంది.. అయినా ఇక్కడికి మీకోసం వచ్చింది ఇక ఆమె ముఖంలో నవ్వు చూడాలనుకుంటున్నాను అది ఖుషి సినిమా హిట్ తో సాధ్యమవుతుంది అంటూ విజయ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news