నావల్లే మా అమ్మ మద్యానికి బానిసయింది – సన్నీలియోన్ ఎమోషనల్ కామెంట్స్..!

-

ఒకప్పుడు పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ హీరోయిన్గా మారిన సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దేశవ్యాప్తంగా భారీ రేంజిలో ఫాలోయింగ్ దక్కించుకున్న ఈమె అందానికి ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. అంతలా తన నటనతో గ్లామర్ తో యువతను ఉర్రూతలూగించింది. ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ చేస్తూ తన అందాలతో పిచ్చెక్కించింది. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపించే ఈమె తరచూ తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్ సినిమాలలోనే నటిస్తూ రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు సినిమాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. ఇక నటిగా ఎన్ని చిత్రాలు చేసినప్పటికీ కూడా ఆమె గత జీవితం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే గతంలో ఆమె పోర్న్ స్టార్ గా వ్యవహరించింది కాబట్టి. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఎన్నో విషయాలను వెల్లడించింది. ఇక తాను మాట్లాడుతూ పంజాబీ కుటుంబ నేపథ్యం ఉన్న నేను కెనడాలో పెరిగాను. ఫ్యామిలీ ఆర్థిక సమస్యలు ఎక్కువ అవడంతో పోర్న్ స్టార్ గా మారాల్సి వచ్చింది. 2012లో పోర్న్ ఇండస్ట్రీని వదిలిపెట్టి బాలీవుడ్లోకి అడుగు పెట్టాను.

అలా మొదటిసారి జిస్మ్ 2 అనే చిత్రంలో నటించాను. ఆ తర్వాత ఎన్నో అవమానాలు, నిందలు కూడా భరించాల్సి వచ్చింది.. అదే సమయంలో అమ్మ మద్యానికి బానిస కావడం.. మరొకవైపు అలా మద్యానికి బానిసైన ఆమె 2008లో మరణించారు. అయితే ఆ సమయంలో అంతా నన్ను నిందించారు. నేను అడల్ట్ ఫిలిమ్స్ లోకి వెళ్ళకముందే మా అమ్మకు మద్యం అలవాటు ఉండేది. అలాగని నేను ఏమాత్రం కారణం కాదు అని చెప్పను అయితే నేను అలా ఇండస్ట్రీకి వెళ్లడం మా అమ్మకు ఏమాత్రం ఇష్టం లేదు. దానివల్ల మరింతగా తాగుడుకు బానిసయ్యింది. ఇక ఆమె మరణ వార్త ఇప్పటికి నన్ను బాధ పెడుతూనే ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news