సమంత విషయంలో అలాంటి రూమర్లకు చెక్ పెట్టిన నాగచైతన్య..!!

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోయిన దగ్గర నుంచి వీరిద్దరి విషయం పైన ఎన్నో రకాల రూమర్ల సోషల్ మీడియాలో ఇప్పటికి వినిపిస్తూనే ఉన్నాయి.. ప్రేమించి మరి వివాహం చేసుకున్న ఈ జంట ఊహించని విధంగా విడాకులు తీసుకుని ఒకసారిగా అభిమానులకు షాక్ ఇచ్చారు. ఈ జంట విడిపోయిన దగ్గర నుంచి ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు.. అదే సమయంలో సమంత అనారోగ్యానికి కూడా గురికావడంతో అభిమానులు తీవ్రమైన నిరాశలోకి వెళ్లిపోయారు.

మయూసైటిస్ ద్వారా ఇబ్బంది పడుతున్న సమంత ఇప్పుడిప్పుడే కాస్త ఈ వ్యాధి నుంచి కోలుకుంటోంది. దీంతో ఒక ఏడాదిపాటి సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది సమంత. నాగచైతన్య కూడా తన సినిమాలతో ప్రస్తుత బిజీగా ఉన్నారు. ఇటీవల సమంత ,విజయ్ దేవరకొండ కలిసి ఖుషి సినిమాలో నటించారు..ఈ సినిమా సెప్టెంబర్ 1న చాలా గ్రాండ్గా విడుదల కాబోతోంది.. ఈ చిత్రానికి డైరెక్టర్ శివ నిర్వహణ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకు ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ,ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

ఇటివలె నాగచైతన్య ఒక థియేటర్ కు సినిమాకు చూడడానికి వెళ్లారని అయితే అక్కడ ఖుషి సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడంతో చైతు అక్కడి నుంచి బయటికి వచ్చేసారని ఒక వార్త సోషల్ మీడియాలో నిన్నటి రోజు నుంచి వైరల్ గా మారుతోంది..ఈ విషయంపైన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగచైతన్య క్లారిటీ ఇవ్వడం జరిగింది.. తాజాగా కొన్ని అవాస్తవాలు ప్రచారం జరుగుతున్నాయి వాటిని అసలు నమ్మకండి అందులో ఎలాంటి నిజం లేదంటూ తెలియజేశారు.. దీంతో సమంత, చైతన్య మీద వస్తున్న పుకార్లకు సైతం చెక్ పెట్టారని చెప్పవచ్చు.. ప్రస్తుతం డైరెక్టర్ చందు మండేటి దర్శకత్వంలో నాగచైతన్య ఒక సినిమాలో నటించబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news