కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ హ్యాట్రిక్?

-

కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కే‌సి‌ఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు..బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించనున్నారా? అంటే తాజాగా బి‌ఆర్‌ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే అదే నిజమనిస్తుంది. ఇప్పటివరకు బి‌ఆర్‌ఎస్ పార్టీలోకి టి‌డి‌పి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున వచ్చారు. అంటే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి గెలిచిన చివరికి బి‌ఆర్‌ఎస్ లోకి రావాల్సిందే అనే పరిస్తితి.

ఈ సారి ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్తితి ఉంటుందని బి‌ఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో తమ కోవర్టులు ఉన్నారు బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. అంటే కాంగ్రెస్ నుంచి తమకు అనుకూలమైన నేతలని పోటీ చేయించి గెలిపించి..మళ్ళీ బి‌ఆర్‌ఎస్ లోకి తీసుకుంటామనే విధంగా బాల్క చెప్పుకొచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది. అసలు కాంగ్రెస్ పార్టీలో బి‌ఆర్‌ఎస్‌కు అనుకూలమైన నేతలు ఎవరు. పైగా 119 సీట్లు ఉంటే 1025 మంది కాంగ్రెస్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కన్ఫ్యూజన్ నెలకొంది.

బి‌ఆర్‌ఎస్ పార్టీ కావాలనే కాంగ్రెస్ లో కోవర్టులని పెట్టి రాజకీయం చేస్తుందా? అనే డౌట్ వస్తుందా? లేదా ఇదేమైనా మైండ్ గేమ్? అనేది కూడా క్లారిటీ లేదు. అదే సమయంలో కొంతమంది కాంగ్రెస్ కుక్కలని తమ పార్టీలోకి చేర్చుకుని పిల్లులుగా మార్చమని పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పరిణామాలని చూస్తుంటే..కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి బి‌ఆర్‌ఎస్ పార్టీ గట్టిగానే స్కెచ్ వేసినట్లు కనిపిస్తోంది.

ఇక ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ ఎవరు దాటకుండా బి‌ఆర్‌ఎస్‌కు లీడ్ వస్తే..ఆ పార్టీలోకి కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్ళు జంప్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ మళ్ళీ బి‌ఆర్‌ఎస్ పూర్తి ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన అప్పుడు కూడా కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు జంప్ అవ్వడం ఖాయమనే పరిస్తితి.

Read more RELATED
Recommended to you

Latest news