ఫారిన్ అమ్మాయితో అర్జున్ రెడ్డి.. బాబు విజయ్ ఏంటి కథ..!

-

లేటెస్ట్ యువ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా చేసిన మూడు సినిమాలు హిట్ కొట్టడంతో అతన్ని స్టార్ అనేస్తున్నారు. కెరియర్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్న విజయ్ ఓ ఫారిన్ అమ్మాయితో నడిపిస్తున్న ప్రేమాయణం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. సినిమాల్లోకి రాకముందు నుండే విజయ్ ఓ ఫారిన్ గాళ్ తో క్లోజ్ గా ఉంటున్నాడట. అయితే ప్రస్తుతం ఓ ఫారిన్ అమ్మాయితో విజయ్ దేవరకొండ క్లోజ్ గా ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో లీకయ్యాయి.

ఆ పిక్స్ లో విజయ్ ఆ అమ్మాయితో ముద్దు ముచ్చట్లు బాగున్నాయి. చాలా క్లోజ్ గా కనిపిస్తున్న ఈ ఇద్దరి మధ్య ఏముంది. అసలు విజయ్ తో అంత క్లోజ్ గా ఉన్న ఆ అమ్మాయి ఎవరు అన్న సందేహాలు మొదలయ్యాయి. తెల్లతోలు పిల్లతో మన అర్జున్ రెడ్డి దిగిన ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విజయ్ క్రేజ్ కు ఇవేవి అడ్డుగా మారకముందే విజయ్ ఆ అమ్మాయి గురించి వివరణ ఇస్తే బెటర్. ప్రస్తుతం నోటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయ్ డియర్ కామ్రేడ్ సినిమా కూడా చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version