సమంతతో నాగ శౌర్య.. లేడీ డైరక్టర్ ప్రయోగం

-

అలా మొదలైంది సినిమతో దర్శకురాలిగా తన సత్తా చాటిన నందిని రెడ్డి ప్రస్తుతం సమంతతో ఓ సినిమా చేయాలని చూస్తుందట. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా కథ కొత్తగా ఉంటుందట. ప్రయోగాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో సమంతతో పాటుగా యువ హీరో నాగ శౌర్య కూడా నటిస్తాడని తెలుస్తుంది. పెళ్లి తర్వాత యూటర్న్ అంటూ కెరియర్ లో కొత్తర్ టర్న్ మొదలు పెట్టిన సమంత నందిని రెడ్డి డైరక్షన్ లో మరో సంచలనానికి సిద్ధమైంది.

ఈ సినిమాలో సమంత యంగ్, ఓల్డ్ గెటప్పులలో కనిపిస్తుందట. మిస్ గ్రానీ రీమేక్ గా ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. కొన్నాళ్లుగా సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న నందిని రెడ్డి ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది. మరి సమంత, నాగ శౌర్య క్రేజీ కాంబినేషన్ సెట్ చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version