సికింద్రాబాద్ – గోవా వెళ్లే రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి..ప్రత్యేకతలు ఇవే

-

సికింద్రాబాద్ – గోవా వెళ్లే రైలు ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని భోయి గూడా వైపు గల పదో నెంబర్ ప్లాట్ ఫారం పై నుండి గోవా రైలు సర్వీస్ ను ప్రారంభించారు. ఈ ట్రైన్‌ విశిష్టతలు పరిశీలిస్తే.. తెలంగాణ రాజధానితో గోవా రాజధాని వాస్కో-డ-గామాతో మెరుగైన అనుసంధానం చేశారు. ఈ రైలు వారానికి రెండు రోజులు ఇరు మార్గాలలో నడపబడుతోంది. ప్రస్తుతం కర్నాటక మరియు గోవా ప్రాంతాలకు వెళ్లేందుకు తెలుగు వారికి ప్రయాణ సౌలభ్యాలు తక్కువగా ఉన్నాయి.

Kishan Reddy started the Secunderabad – Goa train

గోవా చేరుకోవడానికి గుంతకల్లు వద్ద ఉన్న ఇతర రైళ్లకు అనుసంధానించవలసిన లింక్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ రైలు అనుకూలమైన సమయాలతో సికింద్రాబాద్ నుండి ప్రత్యేకమైన రైలు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది.. ఈ కొత్త రైలు దాదాపు 854 కి.మీల దూరాన్ని దాదాపు 20 గంటలపాటు ఎగువ దిశలో మరియు 21 గంటల పాటు దిగువ దిశలో ప్రయాణం పూర్తిచేస్తుంది.. ఈ రైలు మార్గంలో ప్రత్యేకమైన చారిత్రక, పర్యాటక ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఇతర ముఖ్యమైన నగరాలను కలుపుతూ, నూతన ప్రాంతాలనుంచి పెరిగిన ప్రయాణికులతో నిర్దిష్ట బంధాన్ని ఏర్పరుచు కోవడానికి అవకాశం కల్పిస్తుంది.. ఈ రైలు అత్యాధునిక ఎల్.ఎచ్.బి. కోచ్లతో ప్రవేశపెట్టబడి ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని మరియు ఆధునిక సౌకర్యాలను అందిస్తుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version