రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా వివరించినక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు ఆయన గురించి పూసగుచ్చినట్టు అన్నీ వివరంగా తెలుసు. ఆయన ఎలాంటివాడు, ఎలా మాట్లాడతాడు, ఎలాంటి సందర్భాన్ని ఎలా వాడుకుంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. సందర్భం లేకుండా చేసే కామెంట్స్ కొన్నైతే, అసందర్భానుసారంగా వేసే ట్వీట్స్ కొన్ని. ఎప్పుడు ఎలాంటి కామెంట్స్ చేస్తాడో అంచనావేయడం చాలా కష్టం. తాజాగా అలాంటి క్యాటగిరీలోకి మెగా బ్రదర్ నాగబాబు వచ్చాడు.
యూ ట్యూబ్‌లో నా ఇష్టం పేరిట ఓ చానెల్ పెట్టి ఎడాపెడా వాయించేస్తుంటాడు. ఇక ట్వీట్ల దాడితో అందరినీ ఓ రౌండ్ వేసుకుంటున్నాడు. గత కొన్ని రోజులుగా రాజకీయ సెటైర్స్, కరోనాపై కామెంట్స్ చేస్తూ హల్చల్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా చేసిన ఓ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. అదేంటో ఓ సారి చూద్దాం.
‘మా దేవుడు గొప్ప,మా దేవుడు గొప్ప అని ఇంకా కొట్టుకొని చావకండి..దేవుళ్ళు, స్వామిజీలు దేవుడి ప్రతినిధులు ఏమి పీకలేక గుళ్ళు ప్రార్థన మందిరాలు ఇంకా అన్ని మూసుకొని కూర్చుని సైంటిస్ట్ లు డాక్టర్స్ ఏ మందు కనిపెట్టి మనలని కాపాడతారా అని ఎదురు చూస్తున్నారు. వెళ్లి సైంటిస్టులకి మొక్కుదాం.ఈ కారోన బారినుంచి మనల్ని కాపాడేది వాళ్లే’అంటూ ట్వీట్ చేశాడు. ఇదంతా చూస్తుంటే నిజంగానే నాగబాబుకు కూడా వర్మ పైత్యం పట్టినట్టుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.