పవర్ ఫుల్ పోలీసు పాత్రలో నాగ చైతన్య..?

Join Our Community
follow manalokam on social media

అక్కినేని నాగ చైతన్య చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. సాయిపల్లవి హీరోయిన్ గా కనిపిస్తున్న లవ్ స్టోరీ చిత్రం ఏప్రిల్ 16వ తేదీన విడుదలకి సిద్ధం అవుతుంది. అటు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ చిత్రం రూపొందుతుంది. తాజా సమాచారం ప్రకారం నాగ చైతన్య చేతికి మరో సినిమా వచ్చిందని టాక్. పెళ్ళి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్, నాగ చైతన్యకి కథ వినిపించాడని అంటున్నారు. పోలీసు డ్రామా ఉండే ఈ కథలో నాగ చైతన్య పవర్ ఫుల్ గా కనిపించనున్నాడట.

ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. నాగ చైతన్య ఓకే అంటే మరికొద్ది రోజుల్లో లాంఛన కార్యక్రమాలు పూర్తయ్యి సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నాగ చైతన్య పోలీస్ గా నటించిన సినిమాలంటే సాహసం శ్వాసగా సాగిపో మాత్రమే. అందులోనూ ఫుల్ లెంగ్త్ లో కనిపించలేదు. కానీ తరుణ్ భాస్కర్ తో చేయబోయే చిత్రంలో ఫుల్ లెంగ్త్ పవర్ ఫుల్ పోలీస్ పాత్ర ఉందట. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కనుందో చూడాలి.

TOP STORIES

నమ్మండి.. ఈ ప్లాస్టిక్‌ పర్యావరణానికి హాని కలిగించదు

పర్యావరణానికి హాని చేయని ప్లాస్టిక్‌ కవర్లను చూశారా? ప్లాస్టిక్‌ పర్యావరణానికి హాని కలిగించదా! అని ఆశ్చర్యపోకండి. మీరు విన్నది నిజమేనండి. మనం వాడి పడేసిన కవర్లు...