మాల్దీవ్స్ ట్రిప్ ను నాగార్జున క్యాన్సిల్ చేయడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ….’ఎవరో ఏదో అంటారని ట్రిప్ క్యాన్సిల్ చేయలేదు. మాల్దీవ్స్ బాగుంటుంది. 150 కోట్ల ప్రజలకు లీడర్ అయిన ప్రధాని మోదీపై వారు చేసిన కామెంట్స్ సరైనవి కాదు.
లక్షద్వీప్ ఎంతో సుందరంగా ఉంటుంది. అక్కడికే వెళ్తాం’ అని చెప్పుకొచ్చారు. సెలబ్రిటీలందరూ ఈ నిర్ణయం తీసుకోవాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు ఇండియా తన వ్యూహాత్మక నిర్ణయాలతో సమాధానమిస్తోంది. లక్షద్వీప్ లో మాల్దీవులకు ధీటుగా టూరిజంను డెవలప్ చేయడంపై ఇండియా దృష్టి పెట్టిందనేలా ఈ నిర్ణయాలు కనిపిస్తున్నాయి.