సంతానలేమి సమస్య ఇప్పుడు అతి పెద్ధ వ్యాధి. సంతానలేమికి కారణం చాలా సమస్యలు ఉన్నాయని తెలుసు.. కానీ మనకు తెలిసి చేజేతులా చాలా మంది అవగాహన లేమితో ఇబ్బందులలో పడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం కాలంలో డాక్టర్లు చెబుతున్న ప్రకారం మగవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువ కావడం వలన సంతానలేమి కలుగుతోంది. ఇందుకు కారణాలుగా స్మోకింగ్ , వాతావరణ పరిస్థితులు, స్ట్రెస్, ఆల్కహాల్ వంటివి చెబుతున్నారు.
అయితే, తాజాగా సంతానలేమి గురించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోయి సంతానం లేమికి కారణం కారు సీటు కూడా కారణమని ఇంగ్లాండు సైంటిస్టులు తేల్చారు. వీర్యకణాలు ఉత్పత్తి సక్రమంగా జరగాలంటే పురుషుల శరీరంలోని మిగిలిన భాగాల కంటే వృషణాల వద్ద చల్లగా ఉండాలి. కారు, బైక్ సీట్లు అత్యధిక వేడిని విడుదల చేస్తాయి. ఎక్కువ దూరం ప్రయాణించడం వల్ల వృషణాల్లో వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుందని గుర్తించారు. బిగుతైన ప్యాంటు ధరించడం మరో కారణమని వెల్లడించారు.