బిగ్ బాస్ షో ను నాగార్జున వదిలిపెట్టాలి..!!

-

అక్కినేని నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా దసరా పండుగ కు వచ్చి బోల్తా కొట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అనవసర విషయాలు వదిలి సినిమాల మీద ద్యాస పెట్టాలని కోరుతున్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం గతంలో ఓకే తరం హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున అందరూ ఇప్పటికి కూడా తమ దైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. వీరిలో నాగార్జున తప్ప మిగిలిన అందరూ సక్సెస్ ట్రాక్ లో వున్నారు.

నాగార్జున మాత్రం ఇప్పటికీ ఫ్లాప్ ల నుండి బయటకి రావటం లేదు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ తరువాత నాగ్ కు మంచి హిట్ రాలేదు. ఎంతగా కష్టపడుతున్నా గాని   సక్సెస్ అందుకోలేకపోతున్నారు.ఈ ఏడాది సంక్రాంతి కి’బంగార్రాజు సినిమా విడుదల అయ్యింది. అది పెద్దగా  విజయం సాధించలేదు. ‘ది ఘోస్ట్’ సినిమాను కూడా కష్టపడి మంచి ఏక్షన్ సినిమాగా తీశారు. కాని ఈ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. చిరు ‘గాడ్ ఫాదర్’  బాగుండటంతో  ఆసినిమా ఎఫెక్ట్  ‘ది ఘోస్ట్’ మీద పడింది. దానితో సినిమా మూడు రోజుల్లోనే మటాష్ అయ్యింది.

దీంతో నాగార్జున అలోచనలో పడ్డారు. ఆయన అభిమానుల మాత్రం గేరు మార్చాల్సిన అవసరం వుందని కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఈ నలుగురు హీరోల మధ్య మంచి పోటీ వుండేది. ఒకరిని మించి మరొకరి సినిమా హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఎప్పుడూ కోరుతూ వుంటారు. కొంత మంది మాత్రం ఈ పరిస్థితి కి కారణము బిగ్ బాస్ షో అని దానిని  వదిలి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు కంటెంట్ సరిగా వుంటే చాలు హిట్ ఆటోమేటిక్ గా వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం నాగ్ తనకు అనుకూలంగా వుండే డైరెక్టర్స్, రైటర్స్ తో కూర్చోని చర్చలు మీద చర్చలు చేస్తున్నాడట. ఆయన ప్రయత్నాలు ఫలించి నాగార్జున తొందరగా హిట్ కొట్టాలని అభిమానుల కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version