అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు.. కాక రేపుతున్న ప్రొమో

-

బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘ఆహా’లో మొదలైన ‘అన్‌ స్టాపబుల్‌’ టాక్‌ షో బెస్ట్‌గా పేరు తెచ్చుకుంది. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు ఈ షోలో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఈ టాక్‌ షో సెకండ్‌ సీజన్‌కు సంబందించిన పనులు జరగుతున్నాయి. రెండో సీజన్‌ మొదటి ఎపిసోడ్‌ను చంద్రబాబునాయుడుతో చేశారు. ఈ నెల 14వ తేదీన ఈ ఎపిసోడ్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలయ్య – చంద్రబాబు మధ్య నడిచిన ఎపిసోడ్‌ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రొమోను విడుదల చేశారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ టాక్ షో టీజర్ ప్రేక్షకుల్లో దీనిపై అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే ఈ టాక్ షో రెండో సీజన్ తొలి ఎపిసోడ్‌కు ఎవరు వస్తారా అనే అంశానికి తెరదించుతూ, తాజాగా నిర్వాహకులు ఈ టాక్ షో తొలి ఎపిసోడ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.

అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2 తొలి ఎపిసోడ్‌కు ముఖ్య అతిథులుగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ కలిసి వచ్చారు. ఇక ఈ ప్రోమోలో చంద్రబాబును అందరికీ బాబుగారు, తనకు బావగారు అంటూ బాలయ్య ఆహ్వానించిన తీరు భలే ఉండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాబుతో కలిసి బాలయ్య చేసిన సందడి మామూలుగా ఉండబోదని ఈ ప్రోమో వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇక బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్ హోస్ట్‌గా మారి తన తండ్రి, మామలను పలు ఆసక్తికర ప్రశ్నలు అడగ్గా.. తండ్రీ కొడుకులు కలిసి తన సంసారంలో నిప్పులు పొస్తున్నారు అంటూ బాలయ్య చేసిన కామెంట్ నవ్వులను పూయించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version