కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా నాగార్జున శేఖర్ కమ్ముల లేటెస్ట్ సినిమా …?

-

అక్కినేని నాగార్జున మన్మధుడు 2 వంటి భారీ డిజాస్టర్ తర్వాత మళ్ళీ తన మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాని అనౌన్స్ చేయలేదు. కాని మరోసారి పోలీస్ అధికారిగా వైల్డ్ డాగ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నాగార్జున డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ గా కనించబోతున్నాడు.

 

ఇక ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీటయిన ఈ సినిమా నుండి రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. వాస్తవంగా అయితే ఈ సినిమా ఈ పాటికే కంప్లీటవ్వాల్సింది. కాని లాక్ డౌన్ మూలానా షూటింగ్ ని నిలిపివేశారు. జూన్ 15 నుండి తిరిగి ఈ సినిమా షూటింగ్ మొదలవనుందని తాజా సమాచారం. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న బ్రహ్మాస్త్ర లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

 

ఇక నాగార్జున మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లో నటించబోతున్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం నాగ చైతన్య తో లవ్ స్టోరీ అన్న సినిమాని తెరకెక్కిస్తున్న శేఖర్ కమ్ముల ఈ సినిమాని తెరకెక్కిస్తాడట. ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాని తెరకెక్కిస్తున్న నిర్మాతలే ఈ సినిమాని నిర్మిస్తారని సమాచారం. ఇప్పటికే శేఖర్ కమ్ముల మార్క్ బ్యూటి ఫుల్ స్టోరీని నాగార్జున కోసం సిద్దం చేశాడట. నాగా చైతన్య సాయి పల్లవి తో తీస్తున్న లవ్ స్టోరీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఆ సినిమా కంప్లీటవగానే నాగార్జున శేఖర్ కమ్ముల సినిమా ప్రారంభం అవుతుందని లేటెస్ట్ న్యూస్.

Read more RELATED
Recommended to you

Exit mobile version