‘బిగ్ బాస్’ సీజన్ 3 అయిపోయింది. రాహుల్ విజేతగా … వెండితెరపై యువ సామ్రాట్‌గా, కింగ్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అక్కినేని నాగార్జున. బుల్లితెరపై కూడా సత్తా చాటారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోతో హోస్ట్‌గా టెలివిజన్ రంగంలోకి ప్రవేశించిన నాగార్జున.. వివాదాస్పద రియాలిటీ షో ‘బిగ్ బాస్’కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించి సక్సెస్ అయ్యారు. అసలు విషయంలోకి వెళ్తే.. బిగ్‌బాస్-3 లో అలీరెజా కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో అలీరెజా చాలా స్టైలిష్‌గా ఉండేవాడు. అతని డ్రెస్సింగ్‌ను నాగార్జున కూడా చాలా ఇష్టపడేవారు. ఒక వీకెండ్ కార్యక్రమంలో నాగార్జున ధరించిన బ్రాండెడ్ షూస్‌ను అలీ ఇష్టపడ్డాడు. అలాంటి షూ తనకు కావాలని నాగ్‌ను కోరాడు. కచ్చితంగా గిఫ్ట్ ఇస్తానని నాగ్ ప్రామిస్ చేశారు.
ప్రామిస్ చేసిన విధంగా అలీరెజాకు నాగ్ తాజాగా గిఫ్ట్ పంపించారు. నాగార్జున గుర్తుపెట్టుకుని మరీ తన కోరిక నెరవేర్చడంతో అలీ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. `నిజంగా మాట మీద నిలబడే మనిషి. తన ఫేవరెట్ బ్రాండ్ షూస్‌ను నాగార్జున నాకు గిఫ్ట్‌గా పంపించారు. అలాంటి షూస్ కావాలని బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు నాగార్జునగారిని కోరాను. మాట ఇచ్చిన విధంగా నాకు ఇప్పుడు పంపించారు. లవ్యూ నాగార్జున సర్` అంటూ అలీ ట్వీట్ చేశాడు. నాగార్జునతో కలిసి దిగిన ఫొటోను కూడా పంచుకున్నాడు.