దేవర కలెక్షన్స్ పై నాగవంశీ సంచలన వ్యాఖ్యలు

-

దేవర సినిమా కలెక్షన్స్ గురించి నిర్మాత నాగవంశీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర మూవీ రెండు రాష్ట్రాల తెలుగు హక్కులను నాగవంశీ ఆసక్తికరమైన ధరకు దక్కించుకున్నారు. తాజాగా విజయదశమి సందర్భంగా లక్కీ భాస్కర్ సినిమాకి సంబంధించిన ప్రెస్ ఏర్పాటు చేశారు నాగవంశీ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న సమయంలో దేవర కలెక్షన్ల గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.

ఆ విషయంలో హ్యాపీగానే ఉన్నారా..? అంటే చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అదేవిధంగా కలెక్షన్లు ఫేక్ అనే ప్రచారం జరుగుతుంది. కాస్త ఎక్కువ చేసి చెబుతున్నారట నిజమేనా అడిగితే అదేమీ లేదని తనకు వచ్చిన కలెక్షన్లు ఉన్నవి ఉన్నట్టుగానే తాను చెప్పానని చెప్పుకొచ్చారు. తాను డబ్బులు వచ్చాయని చెబుతున్నా.. మీడియా నమ్మకం లేదు. మీడియా నమ్మితే వచ్చినట్టు ఫీల్ అవుతాను అన్నట్టు మాట్లాడారు. అసలు ఇలా కలెక్షన్లు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందా..? అని అడిగితే ఇది ఎవరినో ఉద్దేశించి రిలీజ్ కాదన్నారు. కేవలం హీరోల అభిమానులను సంతృప్తి పరచడం కోసమే కలెక్షన్లు నెంబర్ రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు నాగవంశీ. 

Read more RELATED
Recommended to you

Latest news