స్టార్ హీరోతో నమిత ఎఫైర్.. తట్టుకోలేక ఆ డైరెక్టర్ ఏం చేశారంటే..?

-

ప్రముఖ సీనియర్ హీరోయిన్ నమిత గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. 2002లో సొంతం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. స్లిమ్ ఫిగర్ మెయింటైన్ చేస్తూ ఎంతోమంది కుర్ర కారు హృదయాలను దోచుకున్న నమిత అప్పట్లో ఎంతో మందికి ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పొచ్చు. అంతేకాదు అమ్మాయిల కలల రాకుమారిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇలాంటి ఈమె ఒకానొక సమయంలో స్టార్ హీరోతో ఎఫైర్ పెట్టుకుందని.. అది చూసి తట్టుకోలేకపోయిన ఒక స్టార్ డైరెక్టర్ ఆమెను సెట్లో అందరి ముందు అవమానించారని సమాచారం.

అసలు విషయంలోకి వెళితే.. ప్రముఖ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో మొదటి అవకాశాన్ని అందుకొని మంచి విజయాన్ని సొంతం చేసుకుంది నమిత. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆ చిత్రం హీరో ఆర్యన్ రాజేష్, నమిత ఇద్దరూ చట్టపట్టలేసుకొని తిరగడం మొదలుపెట్టడంతో డైరెక్టర్ శ్రీనువైట్లకి బాగా కోపం వచ్చిందట. అయితే ఒకసారి ఫారిన్ షూటింగ్లో నమిత, రాజేష్ చాలా క్లోజ్ గా ఉండడం చూసి విపరీతంగా ఫైర్ అయ్యాడట శ్రీనువైట్ల. అంతేకాదు అందరి ముందే ఆమెను తిడుతూ అవమానించాడట. దీంతో కృంగిపోయిన నమిత ఇకపై శ్రీనువైట్ల తో నటించే ప్రసక్తే లేదని డిసైడ్ అయ్యిందని సమాచారం.

ఇక సొంతం సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే జెమిని సినిమాలో అవకాశం రావడంతో అందులో కూడా నటించింది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచినా.. నమితకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత మరో రెండు తెలుగు చిత్రాలలో నటించి తమిళ్ ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది నమిత.

Read more RELATED
Recommended to you

Latest news