నంద‌మూరి హీరోకు ఇదైనా క‌లిసొచ్చేనా?

 

`ఒక‌టో నంబ‌ర్ కుర్రాడు` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు నంద‌మూరి తార‌క‌ర‌త్న. ఆ త‌రువాత ఎన్ని చిత్రాలు చేసినా ఆశించిన స్థాయిలో ఆక‌ట్టుకోఏక‌పోతున్నాయి. స్టార్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చినా తార‌క ర‌త్న మ్యాజిక్ చేయ‌లేక‌పోతున్నారు. కొంత విరామం త‌రువాత తార‌క‌ర‌త్న ఓ స్పోర్ట్స్ నేప‌థ్య చిత్రాన్ని అంగీకిరంచారు. ఈ చిత్రానికి `సార‌థి` అనే టైటిల్‌ని చిత్ర బృందం ఖరారు చేసింది.

ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ తో పాటు మోష‌న్ పోస్ట‌ర్‌ని ఈ నెల 25న రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని చిత్ర బృందం తాజాగా వెల్ల‌డించింది. గ‌తంలో ఖోఖో నేప‌థ్యంలో `ర‌థేరా` చిత్రాన్ని రూపొందించిన జూక‌ట ర‌మేష్ ఈ చిత్రానికి ద‌ర్శ‌‌క‌త్వం వ‌హిస్తున్నారు. జ‌న‌వ‌రిలో విడుద‌లైన ఈ చిత్రానికి మంచి స్పంద‌న ల‌భించింది. తాజాగా ఇదే నేప‌థ్యంలో `సార‌థి` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో తార‌క‌ర‌త్న హీరోగా డిఫ‌రెంట్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు.

ఒక షెడ్యూల్ మిన‌హా చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్తియింది. క‌రోనా స‌మ‌యంలో ఇటీవ‌ల క‌డ‌ప‌లో ప్ర‌ధాన షెడ్యూల్‌ని పూర్తి చేశారు. భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీ అయినా తార‌క‌ర‌త్నకు క‌లిసొస్తుందా? అత‌ని కెరీర్‌ని మ‌లుపు తిప్పుతుందా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.