పురాణాపూల్ వంతెన పై వాహనాల రాకపోకలకు అనుమతి… కానీ ?

-

భారీ వర్షాలకు మూసీ పోటెత్తడంతో హైదారాబాద్ పురాణాపూల్‌ దగ్గర పాతికేళ్ల కిందట నిర్మించిన బ్రిడ్జి దారుణంగా దెబ్బతింది. పిల్లర్లు పెచ్చులూడిపోయి కనిపిస్తుండటంతో.. నిన్న రాత్రి నుంచి బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు… అధికారులు. ఇవాళ బ్రిడ్జిని పరిశీలించాక… టూ వీలర్లను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక పురణాపూల్ కొత్త వంతెన పై కూడా వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చారు అధికారులు.

కేవలం లైట్ మోటార్ వెహికల్స్ కి అనుమతి ఇస్తున్నారు. హెవీ వెహికల్స్ ఎట్టి పరిస్థితిలో అనుమతించడం లేదని చెబుతున్నారు అధికారులు. మరోసారి హైదరాబాద్ లో వర్షం కురిసింది. సికింద్రాబాద్, తార్నాక, బేగంపేట్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. అయితే కాసేపటి క్రితం వర్షం కురవడం ఆగిపోయిందని చెప్పచ్చు. ఇప్పటికే నగరంలో 80 కి పైగా కాలనీలు వరదలోనే ఉన్నాయి. మరోసారి వర్షం కురుస్తుండటంతో ఇంకెన్నీ కాలనీలకు వరద వస్తుందోనని జనం భయపడిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news