తెలుగు రాష్ట్రాలలో నంది అవార్డుల వివాదంపై స్పందించారు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నంది అవార్డుల విషయమై తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలిపారు. కొందరు మీడియా కనిపించగానే అత్యుత్సాహంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలుగు సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు మంత్రి.
వచ్చే ఏడాది ప్రభుత్వం తరపున నంది అవార్డులు ఇచ్చేలా ఆలోచన చేస్తామని చెప్పారు. అయినా ఎవరు పడితే వారు అడిగితే పురస్కారాలు ఇవ్వరని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయాక నంది అవార్డులకు ప్రాధాన్యత తగ్గిపోయిందని ఆదిశేషగిరిరావు వ్యాఖ్యానించగా.. ప్రస్తుతం ఉత్తమ రౌడి, ఉత్తమ గుండా అవార్డులు ఇస్తున్నారని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తలసాని స్పందించారు.