అపరమేధావి కేసీఆర్ ఏం కట్టినా మహాద్భుతమే – వైఎస్ షర్మిల

-

ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. “M.Sc పొలిటికల్ సైన్స్ చదివానని చెప్పే అపరమేధావి కేసీఆర్ గారు ఏం కట్టినా మహాద్భుతమే! ప్రపంచం మెచ్చిన కాళేశ్వరం కడితే.. ఒక్క వరదకే మునిగింది.

దేశం మెచ్చిన యాదాద్రి కడితే.. చిన్నవానకే చిందరవందర. రాష్ట్రం మెచ్చిన సెక్రటేరియేట్ కడితే.. గోడలకు బీటలు.. రెండు జల్లులకే నీటి ఎత్తిపోత. జనం మెచ్చిన పరీక్షలు పెడితే.. పేపర్ లీకులు.. సర్కారుకు లింకులు. సారు ఏం చేసినా ఏం కట్టినా.. అవినీతి చిట్టాలు.. అక్రమాల పుట్టలు.. నాణ్యతకు తిలోదకాలు. సచివాలయ నిర్మాణంపై దర్యాప్తు చేయాలి. భవన నాణ్యతపై పరిశీలన చేయించాలి. 1600కోట్ల ఖర్చుపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి” అని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news