‘నాని 30’మూవీ టైటిల్​ అదేనా.. మళ్లీ చిరంజీవి మూవీ పేరు కొట్టేశాడా..?

-

నేచురల్ స్టార్ నాని దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ పనిలో బిజీగా ఉన్నాడు. ‘నాని 30’ అనే వర్కింగ్ టైటిల్తో జరుగుతున్న షూటింగ్ లో పాల్గొంటున్నాడు. శౌర్యవ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని సరసన ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఈ మూవీ ఈ ఏడాది చివరికల్లా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేసే పనుల్లో బిజీగా ఉన్నారు మూవీ మేకర్స్. ఈ సినిమా టైటిల్ కు సంబంధించి కొన్ని పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గ్యాంగ్ లీడర్ సినిమాతో చిరంజీవి మూవీ టైటిల్ కొట్టేసిన నాని.. ఇప్పుడు ఈ చిత్రానికి కూడా చిరు మూవీ టైటిల్ వాడే ఆలోచనలో ఉన్నట్లు టాక్. తండ్రి-కుమార్తె మధ్య అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నందున..’హలో డాడీ’, ‘హాయ్ డాడీ’, ‘డియర్ డాడీ’ లాంటి పేర్లను పరిశీలిస్తున్నారట. దాదాపు ‘హలో డాడీ’ అనే పేరును ఖరారు చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version