‘V’ లో రాక్షసుడి గా నాని లుక్ : ఇటువంటి రాక్షసుడిని మీరెక్కడా చూసి ఉండరు….!!

-

అష్టాచమ్మా సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ప్రవేశించిన నాచురల్ స్టార్ నాని, ఫస్ట్ సినిమాతో బెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత నుండి మెల్లగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగి మంచి హిట్స్ తో తన క్రేజ్ ని పెంచుకున్న నాని, ప్రస్తుతం మరొక హీరో సుధీర్ బాబు తో కలిసి నటిస్తున్న తాజా సినిమా వి. మంచి యాక్షన్ థ్రిల్లర్ గా ఒక డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అష్టాచమ్మా, జెంటిల్ మ్యాన్ సినిమాల దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

ఇక నిన్న ఈ సినిమా నుండి రక్షకుడిగా నటిస్తున్న సుధీర్ బాబు లుక్ బయటకు రాగా, నేడు రాక్షసుడిగా నటిస్తున్న నాని లుక్ ని రిలీజ్ చేసింది సినిమా యూనిట్. మెలితిప్పిన మీసంతో చేతిలో రక్తం కారుతున్న కత్తెరపట్టుకుని ఉన్న నానిని చూస్తుంటే, అతడు ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో నటిస్తున్నట్లు అర్ధం అవుతుంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని జరుపుకుంటోంది. అదితి రావు హైదరి,

 

నివేత థామస్ హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా పిజి విందా ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. తొలిసారిగా నాని నెగటివ్ రోల్ లో నటిస్తుండడంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల గ్యాంగ్ లీడర్ తో పెద్దగా ఆకట్టుకోని నాని, ఈ సినిమాతో ఎంత మేర సక్సెస్ ని అందుకుంటాడో చూడాలి. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాని రాబోయే ఉగాది కానుకగా మార్చి 25న గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్……!!

Read more RELATED
Recommended to you

Exit mobile version