ప్రభాస్-అర్షద్ వార్సీ కాంట్రవర్సీ.. నేనలా అనకుండా ఉండాల్సింది: నాని

-

కల్కి సినిమాలో ప్రభాస్ జోకర్లా ఉన్నాడంటూ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్లో వివాదాస్పదం అవుతున్నాయి. ఆయన కామెంట్స్పై ఇప్పటికే పలువురు నిర్మాతలు, నటులు స్పందించారు. తాజాగా ఈ వివాదంపై ఓ ఇంటర్వ్యూలో నటుడు నాని.. అర్షద్‌కు ఎన్నడూ రానంత ఫేమ్‌ ఈ కామెంట్స్‌తో వచ్చిందని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్స్లో భాగంగా ముంబయి వెళ్లిన నాని.. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్, అర్షద్ కాంట్రవర్సీపై తాను చేసిన కామెంట్స్పై మాట్లాడారు.

‘‘ప్రభాస్‌ గురించి అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్‌ నేనూ విన్నా. అర్షద్‌ని ఉద్దేశించి నేను చేసిన కామెంట్స్‌ ఏవిధంగా వైరల్‌గా మారాయో అదేవిధంగా ఆయన కామెంట్స్‌ కూడా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయన చాలా గొప్ప నటుడు. నటులుగా ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థమైంది. పదాల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేయకపోవడం వల్ల మేమిద్దరం బాధితులమయ్యాం’’ అని నాని చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version